3 నుంచి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్ ట్రయల్స్

13/06/2012 20:45

 

                 హకీంపేట్‌లోని రాష్ర్ట స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశం కోసం హైదరాబాద్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు వచ్చేనెల 3 నుంచి 5 దాకా జింఖానా గ్రౌండ్స్‌లో జరుగుతాయి.

హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ (హెచ్‌డీఎస్‌ఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో నాలుగవ తరగతి కోసం విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనే  ఆసక్తి

గల వారు ఇతర వివరాలకు హెచ్‌డీఎస్‌ఏ అధికారి ఎ.అలీమ్ ఖాన్(27900649)ను సంప్రదించవచ్చు.