పోలీసు పరీక్షల్లో నెగటివ్ మార్కులు

17/06/2012 09:13

 

* 17న కానిస్టేబుల్ రాత పరీక్ష 
* డిసెంబర్‌లో ఎస్‌ఐ పోస్టులకు

పోలీసుశాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులకు జరిగే రాతపరీక్షలలో మొట్ట మొదటిసారిగా నెగటివ్ మార్కుల విధానాన్ని అమలుచేయనున్నారు. పోలీసు ఉద్యోగ ఎంపిక పరీక్షలలో ఖచ్చితంగా నెగటివ్ మార్కుల విధానాన్ని అమలుచేయాలంటూ రాష్ట్ర హోంశాఖ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు గతంలో ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈనెల 17వ తేదీన కానిస్టేబుల్ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. 

మొత్తం 19,735 కానిస్టేబుల్ , 704 ఫైర్‌మెన్ పోస్టులకు పరీక్షలు జరగనున్నాయి. సివిల్, ఏఆర్, ఏపీఎస్పీలో ఎస్‌ఐ పోస్టులు 1,977, మహిళా ఎస్‌ఐ పోస్టులు 230, ఎస్పీఎఫ్‌లో 68 ఎస్‌ఐ పోస్టులతో పాటు, 21 ఫైర్ ఆఫీసర్ పోస్టులకు డిసెంబర్ 8,9 తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల షెడ్యూలును రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ ఎం.మాలకొండయ్య విడుదల చేశారు. 

పోస్టు, రాతపరీక్ష తేదీల వివరాలివీ
వార్డర్ (జైళ్లశాఖ) - ఆగస్టు 26న; పోలీస్ కానిస్టేబుల్ (కమ్యూనికేషన్స్) - సెప్టెంబర్ 8,9న; ఎస్‌ఐ (కమ్యూనికేషన్స్, పీటీవో) - సెప్టెంబర్ 10,11,12,13న; డిప్యూటీ జైలర్ - అక్టోబర్ 13,14న; సివిల్, ఎస్పీఎఫ్ ఎస్‌ఐ, ఫైర్ ఆఫీసర్స్ - డిసెంబర్ 8,9.

www.sakshieducation.com