ఐసీసీ నూతన చీఫ్‌గా ఐజాక్ * ఈ వారాంతంలో దిగిపోనున్న పవార్

24/06/2012 11:30

 

 

కౌలాలంపూర్: https://sakshi.com/newsimages/contentimages/24062012/ALAN-ISAAC-524-6-12-45344.jpgఅంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడిగా శరద్ పవార్ పదవీ కాలం ఈ వారంతో ముగియనుంది. ఆదివారం నుంచి ఐదు రోజులపాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు జరుగనున్నాయి. వీటితో పాటే జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో కొత్త చీఫ్‌గా న్యూజిలాండ్‌కు చెందిన అలాన్ ఐజాక్ బాధ్యతలు స్వీకరిస్తారు. ‘ఐసీసీ అధ్యక్షుడిగా శరద్ పవార్ రెండేళ్ల పదవీ కాలం ఈ వారాంతంలో ముగుస్తుంది. ఐజాక్ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు’ అని క్రికెట్ మండ లి ప్రకటించింది. అలాగే అధ్యక్షుడితో పాటు 2014 జూన్ నుంచి కొత్తగా ఏర్పాటవుతున్న చైర్మన్ పదవి కోసం చేసిన సవరణలను ఈనెల 28న జరిగే ఐసీసీ కౌన్సిల్ సమావేశం ఆమోదించనుంది. హరూన్ లోర్గాట్ స్థానంలో నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా డేవిడ్ రిచర్డ్‌సన్ ఎన్నికను కూడా ఖరారు చేయాల్సి ఉంది. వీటితోపాటు ఐసీసీ క్రికెట్ కమిటీ సూచించిన డీఆర్‌ఎస్ పద్దతితో పాటు వన్డే ఫార్మాట్‌లో చిన్నపాటి సవరణలను చర్చించడం కూడా సీఈసీ సమావేశ అజెండాగా ఉంది.