APPSC I,II,IV Blood relations - Tnews

31/05/2012 16:43

 

రక్త సంబంధాల సాధనకు తగిన గుర్తులు(APPSC-I,II,IV)

బ్లడ్ రిలేషన్స్ (రక్త సంబంధాలు) కు సంబంధించిన ప్రశ్నలు సాధిస్తున్నప్పుడు ఈ కింది పదాలకు అర్థాలను దృష్టిలో ఉంచుకోవాలి. 
Niece = మేనకోడలు
Nephew = మేనల్లుడు
Uncle = తల్లి/తండ్రి యొక్క సోదరుడు. (తెలుగులో తల్లి సోదరుడిని మేనమామ అని, తండ్రి సోదరుడిని పెదనాన్న/చిన్నాన్న అని పిలుస్తాం. ఆంగ్లంలో ఈ రెంటింటినీ Uncle అనే సంబోధిస్తారు) 
Aunt = తల్లి/తండ్రి యొక్క సోదరి 
Son-in-Law = కూతురు భర్త 
Sister-in-Law = భర్త లేదా భార్య యొక్క సోదరి/సోదరుడి భార్య. 
Brother-in-Law = భర్త లేదా భార్య యొక్క సోదరుడు/సోదరి భర్త. 
Cousin = Uncle లేదా Aunt యొక్క కుమారుడు లేదా కుమార్తె. 
4 బ్లడ్ రిలేషన్స్‌కు సంబంధించిన ప్రశ్నలను పరీక్షలో ఆంగ్ల మాధ్యమంలో చూడడం శ్రేయస్కరం. 
4 ఈ అంశంలోని ప్రశ్నలను సులభంగా సాధించేందుకు కొన్ని గుర్తులు పెట్టుకోవాలి. 
ఉదా ॥ 
1. అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెలను డాట్ లైన్ (......)తో సూచించుకోవాలి. 
2. తల్లి/తండ్రి మరియు కొడుకు/కూతురుల మధ్య బార్‌లైన్ 
() పెట్టుకోవాలి. 
3. మగవారిని ప్లస్ (+) గుర్తుతో, ఆడవారిని మైనస్ (-) గుర్తుతో సూచించుకోవాలి. 
4. భార్యాభర్తలను అనే గుర్తుతో సూచించుకోవాలి. 
పై పద్ధతులు పాటించడం ద్వారా ఈ అంశంలో ఎలాంటి ప్రశ్ననైనా సులభంగా సాధించవచ్చు. 
dad

ఉదాహరణలు ః (Model -1) 
1. A యొక్క తండ్రి B, B యొక్క సోదరి తండ్రి D అయితే D, Aకు ఏమవుతాడు?
వివరణ ః ఇచ్చిన దత్తాంశాన్ని 
వృక్ష చిత్రాల్లో ప్రదర్శించగా 

... A నుంచి D కి సంబంధాలను 
విశ్లేషిస్తే A కి D తాతయ్య అవుతాడు. 
(తండ్రి యొక్క తండ్రి)

2. A తండ్రి భార్య యొక్క తల్లి C, C యొక్క ఏకైక సంతానం D అయితే A యొక్క స్వంత సొదరుడు Dకి ఏమగును? 
వివరణ ః ఇచ్చిన దత్తాంశాన్ని పక్కన చూపిన విధంగా వృక్ష చిత్రంలో ప్రదర్శించవచ్చు. 
i. C యొక్క ఏకైక సంబంధం 
D కాబట్టి 2 స్థానంలో D ఉంటుంది. అంటే D, A యొక్క త్రండి భార్య కాబట్టి A కి తల్లి అవుతుంది. 
ii. కాబట్టి A కి సోదరుడు D కి కొడుకు అవుతాడు. 
సమాధానం ః కొడుకు
3. A, B లు స్వయానా సోదరులు. C, D లు స్వయానా సోదరిణులు. A కుమారుడు D కి సొంత సోదరుడు అయితే C, B ల మధ్య సంబంధం ఏమిటి? 
వివరణ ః brooo






పై చిత్రాన్ని విశ్లేషిస్తే A కుమారుడు D కి సొంత సోదరుడు. అంటే C అనే వ్యక్తి A కుమారుడు అని అర్థమవుతోంది. B 
అనే వ్యక్తి A కి సోదరుడు 
కాబట్టి C కి B పెదనాన్న లేదా చిన్నాన్న (Uncle) అవుతాడు. 
4. ఓ వ్యక్తి, ఓ స్త్రీతో ‘మీ తల్లి భర్త యొక్క సోదరి, నా మేనత్త’ అని చెప్పిన, ఆ స్త్రీ ఈ వ్యక్తికి ఏమగును? 
వివరణ ః 
mather






i. స్త్రీ (A) తల్లి యొక్క భర్త అంటే స్త్రీ తండ్రి (C) అని అర్థం
ii. స్త్రీ తండ్రి యొక్క సోదరి (D) అంటే స్త్రీకి మేనత్త అవుతుది. 
iii. అదే వ్యక్తి (D), ఆ వ్యక్తికి (E)కి కూడా మేనత్త అవుతుంది. కాబట్టి ప్రశ్నలోని స్త్రీకి (A) ఆ వ్యక్తి (E) సోదరుడు అవుతాడు. 
ఉదాహరణలు ః (Model -2) 
1. అంజలి ఒక ఫొటోలోని వ్యక్తిని చూపిస్తూ ‘ఆ వ్యక్తి నా సోదరి యొక్క సోదరుని తండ్రికి ఏకైక కుమారుడు’ అని చెప్పిన ఆ ఫొటోలోని వ్యక్తి అంజలికి ఏమవుతాడు? 
(a). తండ్రి (b). సోదరుడు (c). మేనమామ (d). మరిది 
వివరణ ః పై సంబంధాన్ని కింది విధంగా కూడా విశ్లేషించ వచ్చు. 
i. సోదరి యొక్క సోదరుడు అంటే అంజలికి సోదరుడు. 
ii. సోదరుని తండ్రి అంటే అంజలికి తండ్రి. 
iii. తండ్రికి ఏకైక కుమారుడు అంటే అంజలికి సోదరుడు. 
కాబట్టి ఫొటోలోని వ్యక్తి అంజలి సోదరుడు. 
2. రాము తన మిత్రునికి ఒక ఫొటోలోని వ్యక్తిని చూపిస్తూ ‘ఆమె నా తండ్రి భార్య యొక్క ఏకైక కుమారుడి ఏకైక కుమార్తె’ అనిన ఆ ఫొటోలోని వ్యక్తికి రాముతో ఏవిధమైన సంబంధం ఉంది? 
(a). కూతురు (b). తల్లి (c). సోదరి (d). కోడలు
వివరణ ః 
i. రాము యొక్క తండ్రి భార్య అంటే రాము తల్లి. 
ii. రాము తల్లి యొక్క ఏకైక కుమారుడు అంటే రాము అని అర్థం. 
కాబట్టి ఫొటోలో ఉన్న వ్యక్తి రాము కుమార్తె. 
3. ఒక స్త్రీని చూపిస్తూ రాజన్ ‘ఈమె నా తల్లి భర్త యొక్క తల్లి కూతురు’ అనిన ఆ స్త్రీ రాజన్‌కు ఏమవుతుంది? 
(a). సోదరి (b). తల్లి
(c). మేనత్త (d). కూతురు
వివరణ ః 
i. తల్లి భర్త అంటే తండ్రి 
ii. తండ్రి యొక్క తల్లి అంటే నానమ్మ
iii. నానమ్మ కూతురు అంటే తండ్రి సోదరి. అంటే మేనత్త. 
కాబట్టి రాజన్‌కు ఆ స్త్రీ మేనత్త అవుతుంది. 
ఉదాహరణలు ః (Model -3) 
1. కింది దత్తాంశం నుంచి ఇచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. 
i. A, B యొక్క తల్లి 
ii. C, A యొక్క కుమారుడు 
iii. D, E యొక్క సోదరుడు
iv. E, B యొక్క కూతురు. 
అయినా, D యొక్క గ్రాండ్ మదర్ ఎవరు? 
(a). A (b). B
(c). C (d). D
వివరణ ః 
i. D, E యొక్క సోదరుడు మరియు E, B యొక్క కూతురు అయిన D, B యొక్క కుమారుడు అవుతాడు. 
ii. అలాగే A, B యొక్క తల్లి కాబట్టి A, D యొక్క గ్రాండ్ మదర్ అవుతంది. 
2. దత్తాంశం ః
1. A, B యొక్క సోదరుడు
2. C, A యొక్క తండ్రి 
3. D, E యొక్క సోదరుడు 
4. E, B యొక్క కుమార్తె. 
అయినా D యొక్క ‘అంకుల్’ ఎవరు? 
వివరణ ః పై దత్తాంశంలోని 3, 4ల నుండి D, E యొక్క సోదరుడు మరియు E యొక్క కుమార్తె. కాబట్టి D, Bకి కుమారుడు అవుతాడు. 
అదే విధంగా 1 నుంచి A, B యొక్క సోదరుడు. కాబట్టి A, D యొక్క ‘అంకుల్’. 
మాదిరి ప్రశ్నలు 
1. ఒక వ్యక్తిని చూపిస్తూ ఒక పురుషుడు ఒక స్త్రీతో ఇలా అంటున్నాడు. ‘ఆ వ్యక్తి తల్లి, మీ తండ్రిగారి ఏకైక కుమార్తె’. అయినా ఆ వ్యక్తికి ఆ స్త్రీ ఎమవుతుంది. (a)
(a). తల్లి (b). పిన్ని
(c). అత్త (d). నానమ్మ
2. A, B అన్నదమ్ములు. C, D లు అక్కాచెల్లెల్లు. A యొక్క కుమారుడు ‘D’కి సోదరుడు. అయితే B, ‘C’కి ఏమవుతాడు. (d)
(a). తండ్రి (b). సోదరుడు
(c). తాత (d). అంకుల్
3. రాహుల్ తల్లి, మౌనికా తండ్రికి ఏకైక కుమార్తె. అయితే రాహుల్‌కి మౌనికా భర్త ఏమవుతాడు? (a)
(a). తండ్రి (b). తాతయ్య
(c). సోదరుడు (d). అంకుల్
4. A, C యొక్క తండ్రి మరియు D, B యొక్క కుమారుడు. E అనే వ్యక్తి Aకి సోదరుడు. ఒకవేళ C, D యొక్క సోదరి అయితే Eకి B ఏమవుతాడు / ఏమవుతుంది? (d)
(a). కూతురు (b). భర్త 
(c). సిస్టర్-ఇన్-లా (d). బ్రదర్-ఇన్-లా
5. ఒకవేళ
i. M, N యొక్క సోదరుడు 
ii. B, N యొక్క సోదరుడు 
iii. M, D యొక్క సోదరుడు అయితే 
ఈ కింది వానిలో ఏది నిజం? (c)
(a). N, B యొక్క సోదరుడు 
(b). N, D యొక్క సోదరుడు 
(c). M, B యొక్క సోదరుడు 
(d). D, M యొక్క సోదరుడు 
ప్రాక్టీస్ ప్రశ్నలు
1. A కు B తండ్రి, కాని A, B కు కుమారుడు కాదు. అయితే A-Bల మధ్య సంబంధం ఏది? ( )
(a). చెల్లెలు - అన్న (b). తండ్రి - కూతురు
(c). కూతురు - తండ్రి (d). కొడుకు - తండ్రి
2. A కు B భర్త, B కు C కోడలు, C కు D అల్లుడు, D కు E మామ అయితే E కు A ఏమగును? ( )
(a). తండ్రి (b). తల్లి
(c). అత్త (d). అక్క
3. శోభ, సత్యంను పరిచయం చేస్తూ ‘‘ఇతను మా నాన్న, భార్య యొక్క అమ్మ యొక్క కొడుకు’’ అయితే సత్యం శోభకు ఏమవుతాడు? ( )
(a). అన్నయ్య (b). తమ్ముడు
(c). మామయ్య (d). అల్లుడు
4. X, Y లు భార్యా భర్తలు, A,B లు అన్నదమ్ములు. B అనే వ్యక్తి X కు సోదరుడు. అయితే Y,B కి ఏమవుతాడు?
(a). బావమర్ది (b). అన్నయ్య ( )
(c). అల్లుడు (d). ఏదీ కాదు


raktha