స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కోర్సు వివరాలు..

31/05/2012 08:19

 

వివిధ క్రీడలకు సంబంధించిన టోర్నమెంట్లను సక్రమంగా నిర్వహించడమే స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్. ఒక స్పోర్ట్స్ ఈవెంట్‌కు సంబంధించి షెడ్యూల్ రూపకల్పన మొదలు.. పర్యవేక్షణ, పాల్గొనే క్రీడాకారులు, అధికారులు, సంబంధిత వర్గాలకు తగిన సౌకర్యాలు కల్పించడం వరకు అన్నీ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో ముఖ్య విధులు. 

అంతేకాకుండా టోర్నీలకు తగిన ప్రచారం కల్పించడం, మార్కెటింగ్ వ్యవహారాలను పర్యవేక్షించేబాధ్యత కూడా వీరిదే. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి వివిధ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో స్పోర్ట్స్ మేనేజర్‌గా అవకాశాలుంటాయి. ఆయా టోర్నమెంట్ల నిర్వహణ సమయంలో పీఆర్‌ఓగా కూడా వ్యవహరించవచ్చు. 

అంతేకాకుండా ప్రముఖ క్రీడాకారుల వ్యవహారాలను పర్యవేక్షించే పర్సనల్ మేనేజర్, ఏజెంట్స్‌గా, పీఆర్‌ఓగా అవకాశాలుంటాయి. టైగర్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ వంటి ప్రైవేట్ సంస్థలతోపాటు ప్రభుత్వ క్రీడా సంస్థల్లో కూడా వీరికి అవకాశాలుంటాయి. క్లబ్‌లు, హోటల్స్, రిసార్టులు, స్పోర్ట్స్ సెంటర్లు కూడా స్పోర్ట్స్ మేనేజర్లను నియమించుకుంటున్నాయి. విదేశాల్లోనూ అనేక అవకాశాలుంటాయి.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు: 
పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్;
అలగప్ప యూనివర్సిటీ -తమిళనాడు (డిస్టెన్స్‌లో)
వెబ్‌సైట్: www.alagappauniversity.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ - కోల్‌కతా
వెబ్‌సైట్: www.iiswbm.edu
లక్ష్మిబాయ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్-గ్వాలియర్.
వెబ్‌సైట్: www.lnipe.gov.in
ఎంబీఏ(స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్): తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ-చెన్నై
వెబ్‌సైట్: www.tnpesu.org