సచిన్ ప్రమాణస్వీకారం జూన్ 4న

31/05/2012 16:21

 

 

           భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రాజ్యసభ సభ్యుడిగా జూన్ 4న ప్రమాణస్వీకారం చేయనున్నాడు. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారి తన చాంబర్‌లో సచిన్‌తో ప్రమాణం చేయించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్‌శుక్లా తెలిపారు. 39 ఏళ్ల సచిన్‌ను రాష్ట్రపతి గత ఏప్రిల్‌లో రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, సచిన్‌తోపాటు నామినేట్ అయిన బాలీవుడ్ నటి రేఖ, పారిక్షిశామికవేత్త అను ఆగాలు ఈ నెల మొదటివారంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే సచిన్ ఐపీఎల్‌లో ఆడుతుండడంతో ఇప్పటిదాకా బిజీగా ఉన్నాడు.