కబడ్డీ క్రీడాకారిణులకు *భారీ నజరానా ఒక్కొక్కరికి రూ.25 లక్షలు
కబడ్డీ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టులో సభ్యులైన రాష్ట్ర క్రీడాకారిణులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు పురస్కారాలు ప్రకటించింది. రాష్ట్రానికి చెందిన ఆర్.నాగలక్ష్మి, మమత పూజారిలకు చెరో రూ. 25 లక్షల చొప్పున ప్రోత్సాహకం ప్రకటించింది. భవిష్యత్తులో వీరిద్దరూ మరింతగా రాణించి రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకు రావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ ఏడాది మార్చిలో పాట్నాలో జరిగిన తొలి మహిళల ప్రపంచ కప్‌లో భారత జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. తాను ఈ స్థాయికి చేరేందుకు కారణమైన కబడ్డీ అసోసియేషన్, కోచ్‌లకు నాగలక్ష్మి కృతజ్ఞతలు చెప్పింది.
Hyderabad Time